Amazon Forest: అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో (Amazon Forest) గత నెలలో ఓ చిన్న విమానం కుప్పకూలిన (Flight crash) విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు.
Amazon Forest: అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో (Amazon Forest) గత నెలలో ఓ చిన్న విమానం కుప్పకూలిన (Flight crash) విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. వారి కోసం ఆర్మీ అధికారులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ విజయవంతమయింది. దాదాపు 40 రోజుల తర్వాత ఎట్టకేలకు వారి ఆచూకీ లభ్యమయింది. నలుగురు పిల్లలను ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కొలంబియా ప్రధాని గుస్తావో పెట్రో (Gustavo Petro) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారి ఫొటోలను కూడా షేర్ చేశారు.
ప్రమాదంలో అదృశ్యమైన పిల్లలంతా క్షేమంగా ఉన్నారని గుస్తావో వెల్లడించారు. సైనికులతో పాటు పిల్లలను వెతికేందుకు అడవుల్లోకి వెళ్లిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలియడంతో దేశమంతా సంతోషం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
ఇక పోతే మే 1 సెస్నా 206 అనే ఫ్లైట్‌లో పైలట్‌తో సహా నలుగురు పిల్లలు వారి తల్లి, ఓ బంధువు బయల్దేరారు. కొంత దూరం ప్రయాణించాక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా పైలట్, తల్లి, బంధువు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయట పడ్డారు. 13,9,4 ఏళ్ల పిల్లలతో పాటు 11 నెలల పసివాడు కూడా వారిలో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వారు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పట్టింది.
అయితే సంఘటనా స్థలానికి వెళ్లాక కేవలం మృతదేహాలే లభ్యం కావడంతో పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అధికారులతో పాటు కొంతమంది స్వచ్ఛందంగా పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కొలంబియా దేశస్థులంతా పిల్లు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. చివరికి 40 రోజుల తర్వాత పిల్లల ఆచూకీ లభ్యమయింది.
¡Una alegría para todo el país! Aparecieron con vida los 4 niños que estaban perdidos hace 40 días en la selva colombiana. pic.twitter.com/cvADdLbCpm
— Gustavo Petro (@petrogustavo) June 9, 2023