Joe Biden: కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్
Joe Biden: మొన్నటి వరకు మంచు తుఫాన్‌తో గజగజ వణికిన అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యూఎస్‌లోని కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కూరుస్తుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులన్ని జలశయాలను తలపిస్తున్నాయి. కాలిఫోర్నియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
వరదల వల్ల కాలిఫోర్నియాలో 19 మంది మృతి చెందారని సమాచారం. విపత్తు విధ్వంసం ఆగిపోతేగాని ఎంతమంది మరణించారని తెలుస్తుంది. వరద నీరు మూడంతస్తుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. ఈ వరదల వల్ల 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. తుఫాన్ వల్ల పోటెత్తిన వరదల వల్ల విరిగి పడ్డ మట్టి చరియల్లో..బురదలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వైట్ హౌస్ తెలిపింది.
వరదల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని దాదాపు 25వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కొన్ని వారాలుగా తుఫాన్‌తో భారీ వర్షాలతో కాలిఫోర్నియా ప్రజలు అల్లాడిపోతున్నారు. కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటు చేసుకున్నదని జో బైడెన్ ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆర్థిక, ఆహార,వైద్య సాయం అంద జేయాలని అధికారులను ఆదేశించారు.