కోవిడ్-19 కట్టడిలో భాగంగా జపాన్ కఠిన అంక్షలు విధించి మాస్క్ లు తప్పని సరి అని విధించిన ప్రభుత్వం..మూడేళ్ళ తరువాత అంక్షలని ఎత్తివేసింది.
japan : కరోనా(covid-19) మహమ్మారి సృష్టించిన విలయం గురించి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు చేసిన అంక్షలు.అక్కడి ప్రజల పై కొంత ప్రభావాన్ని చూపినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సుధీర్ఘ కాలం పాటు మాస్కులు ధరించడంతో కొంత మంది జపాన్ (japan)వాసులు నవ్వడమే మరిచిపోయారట. దీంతో ఇటీవల మాస్కులపై(mask) అంక్షలు ఎత్తి వేయడంతో మళ్లీ నవ్వడానికి (japan coaching smile) నేర్చుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నారట. ప్రత్యేక శిక్షణ తరుగుతులకు తీసుకుంటు నవ్వడం నేర్చుకుంటున్నారట.
కోవిడ్-19(covid-19) కట్టడిలో భాగంగా జపాన్ (japan)కఠిన అంక్షలు విధించి మాస్క్ లు తప్పని సరి అని విధించిన ప్రభుత్వం..మూడేళ్ళ తరువాత అంక్షలని ఎత్తివేసింది. మాస్క్ లు ధరించడం ఇక నుంచి ప్రజల వ్యవక్తిగత ఇష్టమని ప్రకటించింది. అంక్షలు సడలించిన తరువాత జపాన్ వాసులు నవ్వడంపై సెమినార్లు,వర్క్ షాపులకు (workshops)పరుగెడుతున్నారట. చేతిలో అద్ధం పట్టుకుని తన ముఖాలను చూసుకుని నవ్వుతున్నారట. టోక్యోలో ఇటువంటి వర్క్ షాపులకు ఇటీవల తాకిడి పెరింగిందని ఎగావోయుకు అనే హాస్య శిక్షణ సంస్థ వెల్లడించింది. అంక్షల కాలంలో సన్నిహితులతో కలవడం కుదరకపోడవంతో పాటు తన నవ్వును ఇతరులతో పంచుకునే అవకాశం కోల్పోయామని సెమినారుకు వచ్చిన వారు వాపోతున్నారని తెలిసింది.. మాస్క్ లు తీసేసాయాల్సి వచ్చినప్పుడు కాస్త భయం,బిడియం గా అనిపిస్తోందని సెమినార్ లో పాల్గోన్నావారు చెప్తున్నారట.
సుధీర్ఘ కాలం పాటు మాస్క్ లు ధరించడం వలన స్నేహితుల ముఖం ఎలా వుంటుంది అన్న విషయం కూడా మరిచిపోయామని టోక్యో లోని స్కూల్ ఆఫ్ స్మైల్ నిర్వాహకులు కైకో కవానో పేర్కోన్నారు. కోవిడ్ మొదలైన కాలం తరువాత నవ్వడం తగ్గిపోయిందన్న భావన ప్రజల్లో మొదలైందని అన్నారు.ఈ అసంతృప్తి చాలా మందిలో వుందని చెప్పారు. అందుకే ప్రజలు మరోసారి తన నవ్వును ఆస్వాదించాలని
కోరుకుంటున్నారని. దీంతో వరుస సెమినార్లతో ఇటీవల తాము ఎంతో బిజీగా మారామని స్మైల్ కోచింగ్ నిరవ్వాహకులు వెల్లడిస్తున్నారు.
కోవిడ్ కు ముందు నవ్వడంపై శిక్షణా తరగతులు,శిక్షణా కార్యక్రమాలు చేపట్టేవారని టోక్యోలోని ఎగావోయుకు సంప్థ వెల్లడించింది. కాని అంక్షలు ఎత్తివేసిన తరువాత ఫ్రిబవరి-ఏప్రిల్ మధ్యకాలంలో మాత్రం ఈ సెమినార్ కు వచ్చే వారి సంఖ్య 4.5 రేట్లు పెరిగిందని తెలిసింది. హాస్యంపై పలు కార్యక్రమాలు నిర్వహించే మరో సంస్థ ఇప్పటి వరకు 4 వేల మందికి శిక్షణ ఇచ్చిన్నట్లు పేర్కోంది. కరోనా అంతర్జాతీయ అత్యతవసర పరిస్థితి కాదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే