Imran Khan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం, ఆందోళనకు దిగుతున్న పీటీఐ నేతలు
Islamabad Police arrives to arrest Imran Khan in Toshakhana case
పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో పార్టీ అభిమానులు ఆందోళనకు దిగారు. తోషా ఖానా కేసులో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేస్తున్నారని తెలియడంతో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన కార్యకర్తలు అందరూ ఇమ్రాన్ ఇంటికి చేరుకోవాలని, ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అడ్డుకోవాలని పార్టీ సీనియర్లు పిలుపునిచ్చారు.
తోశాఖానా కేసులో విచారణకు రావలసిన ఇమ్రాన్ ఖాన్ ముఖం చాటేశాడు. కోర్టుకు రావాలని ఎన్నిసార్లు కోరినా తిరస్కరించాడు. దీంతో సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. దీంతో ఇస్లామాబాద్ పోలీసులు రంగంలో దిగారు.
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పీటీఐ సీనియర్ నాయకుడు ఫవాద్ చౌదరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇమ్రాన్ అరెస్టుతో మరింత దారుణంగా తయారౌతాయని వార్నింగ్ ఇచ్చారు.
Zaman Park Right Now.#ImranKhan#زمان_پارک_پہنچو pic.twitter.com/JAgLldXqxc
— Kashif Javed (@KJOFFICIAL0) March 5, 2023
PTI workers and leadership made their way to Zaman park to protect their leader from the front. Imran Khan is our red line and we will protect him at every cost! #زمان_پارک_پہنچو pic.twitter.com/zWGrZS3QM0
— AS🤍 (@A112xo) March 5, 2023
..