Joe Biden: మధ్యంతర ఎన్నికలకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఇటు డెమొక్రాట్లకు, అటు రిపబ్లికెన్లకు, అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. అమెరికాలో నవంబర్ 8న.. ఎంతో కీలకమైన మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇది అగ్నిపరీక్ష అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు.. అటు డెమొక్రాట్లకు, ఇటు రిపబ్లికెన్లకు కీలకంగా మారింది. అమెరికా పార్లమెంట్ సభలో అన్నిస్థానాలకి సెనేట్‌లో 35 స్థానాలకి అన్ని రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగేవి ఈ సెనేట్ ఎన్నికలు ఇందులో బైడెన్ అగ్నిపరీక్ష ఎదుర్కోనున్నారు.
సెనేట్‌లో 100 సీట్లు ఉంటాయి.50 రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున సెనేట్‌కు వెళతారు. ప్రస్తుతం ఇక్కడ 50-50తో డెమొక్రాట్స్, రిపబ్లికెన్ల మధ్య సమానంగా సీట్లు ఉన్నాయి. అయితే.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డెమొక్రాట్ కావడంతో ఈ పార్టీకి పవర్ కాస్త ఎక్కువ ఉంది. కమలా హ్యారిస్ వద్ద టై బ్రేకింగ్ ఓటు ఉంటుంది. నవంబర్‌లో 34 సీట్లకు ఓటింగ్ జరగనుంది. గెలిచిన వారు 6ఏళ్ల పాటు సెనేట్‌లో ఉంటారు.
పదవిలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలకం. కాంగ్రెస్‌పై పట్టుకోల్పోతే.. కీలక బిల్లులను గట్టెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. ఇప్పుడు డెమొక్రాట్లు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2024లోపు పాస్ చేయాల్సిన బిల్లుల లిస్ట్‌ను డెమొక్రాట్ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. కానీ ఏ ఒక్క సభలోనైనా రిపబ్లికెన్లు ఆధిపత్యం సాధిస్తే.. డెమొక్రాట్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. అంతేకాకుండా.. సెనేట్ పదవీ కాలం 6ఏళ్లు కాబట్టి.. ఇప్పుడు గెలిచిన పార్టీకి 2024 అధ్యక్ష ఎన్నికల్లో కొంత బలం చేకూరుతుంది.
రెండేళ్లకిందట డెమొక్రాట్లు ప్రచారం చేసారు అప్పుడు బైడెన్ గెలిచారు. ఈసారి కూడా అలాగే డెమొక్రాట్లు ప్రజాస్వామ్యమని ఈ ఎన్నికలకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు బైడెన్..ట్రంప్ పార్టీ నుండి ప్రజలకి ముప్పుందని వెల్లడిస్తూ ఈ ఎన్నికల్లో విజయం దిశగా ముందుకెళ్తున్నారు.