అమెరికా బోర్డర్ లో భారత యువకులు అరెస్ట్?
గురువారం తెల్లవారుజామున మునిగిపోతున్న పడవలో 19-21 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు భారతీయులను యుఎస్ సరిహద్దు అధికారులు అరెస్టు చేశారు. ఒక ప్రకటనలో కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా ఎంటర్ అయ్యే యత్నం చేసిన సమయంలో బోర్డర్ స్టేషన్ ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసిందని అధికారులు పేర్కొన్నారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతంలో ఈ మానవ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. ఏప్రిల్ 28న కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ కార్న్‌వాల్ నుంచి సెయింట్ రెగిస్ నదిలో చిన్న పడవ ద్వారా అమెరికా సరిహద్దు ప్రాంతమైన అక్వేసాస్నే మోహాక్‌కు కొందరు అక్రమంగా వెళ్తున్నారు. దాన్ని గమనించిన కెనడా అధికారులు ఆ ప్రాంతంలోని అమెరికా అధికారులకు సమాచారం అందించారు. వారు సెయింట్ రెగిస్ మోహాక్ గిరిజన పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు ఆ చిన్న పడవ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అది మంచుతో గడ్డకట్టిన నదిలో చిక్కుకుని సగం మునిగి ఉంది. అధికారులను చూసి అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఈదుకుని వెళ్లి మిస్ అయ్యాడు. మునుగుతున్న బోటులో ఉన్న ఆరుగురిని భారతీయ పౌరులుగా యూఎస్ పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.