Usha Reddy: అమెరికాలో తెలుగు మూలాలున్న మహిళకు కీలక పదవి?
Usha Reddy Becomes Senator In Kansas State: ఒకప్పుడు పొట్టకూటి కోసం అమెరికా లాంటి దేశాలకు వెళ్లిన తెలుగు వారు ఇప్పుడు అక్కడే ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికై చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా అమెరికా పెద్దల సభగా చెప్పుకునే సెనేటర్ల సభకు భారత అమెరికన్ ఉషా రెడ్డి ఎన్నికయ్యారు. ఈమేరకు శుక్రవారం నాడు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ప్రస్తుత కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 సెనెటర్ టాం హాక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన స్థానంలో ఉషా రెడ్డి సెనేటర్ పదవి సంపాదించారు. 2025 వరకు అంటే రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఇక ఈ బాధ్యత దక్కడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిస్టిక్ 22 నియోజకవర్గం సెనేటర్ గా ఎన్నికవడం గర్వకారణం అని ఆమె కామెంట్ చేశారు. 1973లో ఉషా రెడ్డి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళింది/ అలా వలస వెళ్లే సమయానికి ఆమె వయసు 8 ఏళ్ళు మాత్రమ. అమెరికాలోనే పెరిగి పెద్దయి సైకాలజీలో డిగ్రీ పట్టా. ఎడ్యుకేషనల్ లీడర్షిప్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగిన ఆమె మాన్ హట్టన్ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు కూడా అందించారు.తరువాత మేయర్గా రెండుసార్లు సేవలందించి అక్కడి ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అలా తాజాగా ఆమెకు సెనేటర్ పదవి దక్కడం గమనార్హం.