Covid In China: చైనాలో కోవిడ్ భయంతో ఆత్మహత్యలు
Covid In China: డ్రాగన్ దేశం చైనాలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేసులే కాదు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశ జనాభాలో 60 శాతం మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్ బారిన పడతారని భావిస్తున్నారు. జీరో కొవిడ్ పాలసి ఎత్తివేశాక కేసులు వేగంగా పెరుగుతన్నాయి. కేసులతో పాటు మరణాలు సంభవిస్తున్నా చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. కొవిడ్ రోగులతో ఇప్పటికే ఆస్పత్రులు నిండిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కొవిడ్ రక్కసితో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మహమ్మారికి బలవ్వాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మెడికల్ షాపుల్లో మందుల కొరత తీవ్రంగా ఉండడం వల్ల మహమ్మారికి బలికావస్తుంది. గ్రామీణ చైనాలో ఇలాంటి ఘోర పరిస్థితిని ఇంతకు ముందెన్నడూ చూడలేదని వైద్యులు విస్మమయం వ్యక్తంచేస్తున్నారు. సాధారంగా ఆసుపత్రులకు రోజూ వంద మంది దాకా రోగులు వస్తుంటారు. అయితే, ప్రస్తుతం తరుణంలో ఐదు వందలకు పైబడి రోగుల వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్థానిక డాక్టర్లు అంటున్నారు. మందుల కొరతతో ప్రజలు పశువుల వైద్యానికి వాడే మందులను మింగేస్తున్నారు. ఫలితంగా అనేక మంది సైడ్ ఎఫెక్ట్‌లకు గురవుతున్నారు. కొవిడ్ భయంతో అనేక మంది వృద్ధులు పురుగుల మందులు తాగి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుపుతున్నారు.