landmark legislation: స్వలింగ సంపర్క వివాహాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్
House passes landmark legislation protecting same-sex marriage
స్వలింగ సంపర్క వివాహాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టబద్ధత తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
బిల్లుకు మద్దతుగా 258 మంది, వ్యతిరేకంగా 169 మంది ఓటు వేశారు. మొత్తం డెమోక్రాట్లతో పాటు 39 మంది ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు.
ఈ బిల్లు గత నెలలోనే ఎగువసభ ఆమోదం పొందింది. ప్రస్తుతం దిగువ సభ ఆమోదం కూడా పొందడంతో అధ్యక్షుడు జో బైడన్ వద్దకు వెళ్లింది. జో బైడెన్ సంతకం చేస్తే బిల్లకు చట్టరూపం రానుంది.
తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు అమెరికన్లకు ఉందని జో బైడెన్ తెలిపారు. రెస్పెక్ట్ ఫర్ ది మ్యారేజ్ యాక్ట్ ఆమోదం పొందడంతో లక్షలాది మంది LGBTQI లకు పీస్ ఆఫ్ మైండ్ లభించిందని జో బైడెన్ అన్నారు.
బిల్లు ఆమోదం పొందే సందర్భంలో స్పీకర్ నాన్సీ పావెల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చట్టం కార్యరూపం దాల్చడానికి సహకరించిన న్యాయవాదులందరికీ నాన్సీ పావెల్ ధన్యవాదాలు తెలిపారు.