Food Crisis in Britain: బ్రిటన్‌లో దుర్భర పరిస్థితులు… ముదురుతున్న ఆహార సంక్షోభం
Food Crisis in Britain: రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొందిన గ్రేట్ బ్రిటన్‌లో ప్రస్తుతం పరిస్థితులు దుర్భరంగా మారాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. రోజు రోజుకు పరిస్థితులు మరింత గడ్డుగా మారుతున్నాయి. ప్రజలకు సరిపడినంతగా కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు. రేషన్‌పై అక్కడి ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో కూరగాయలను కూడా పరిమితంగా విక్రయిస్తున్నారు. కనీసం కోడిగుడ్లు కూడా దొరకని పరిస్థితులు దాపురించాయి. క్రమంగా ఆర్థిక మాంద్యం బలపడుతున్న నేపథ్యంలో జీవన వ్యయం భారీగా పెరుగుతున్నది. క్రితం ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది జీవన వ్యయం 50 శాతం పెరిగింది. ఇంధన ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
ఈ ప్రభావం విశ్వవిద్యాలయాలపై కూడా పడింది. విద్యార్ధులకు ఆహరం పంపిణీ విషయంలోనూ కొరతలు విధిస్తున్నారు. సరిపడినంత ఆహారం అందించలేకపోతున్నట్లు ఇప్పటికే విశ్వవిద్యాలయాలు స్పష్టం చేశాయి. రాబోయే రోజులు మరింత దుర్భరంగా మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో పాటు ఉక్రెయిన్‌కు ఉదారంగా భారీ సహాయం అందించడం కూడా బ్రిటన్ ఆర్థిక మాంద్యానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా పెరుగుతున్న నేపథ్యంలో నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.