అమెరికాలోని ఫ్లోరిడాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోయారు.
America: అమెరికాలో (America) కాల్పుల కలకలం కొనసాగుతూనే ఉంది. ఎటు నుంచి ఏ దుండగుడు వచ్చి కాల్పులు జరుపుతాడోనని అమెరికా వాసులు హడలెత్తిపోతున్నారు. షాపింగ్ మాల్స్, బార్లకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఈ ఏడాదిలో కాల్పుల ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. వందల మంది జనాలు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువగా నల్లజాతీయులే ఉన్నారు. తాజాగా ఫ్లోరిడాలో (Florida) మరోసారి కాల్పులు గందరగోళం సృష్టించాయి. పట్టపగలే ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
శనివారం మధ్యాహ్నం జాక్సన్‌విల్లెలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ దుండగులు కాల్పులకు పాల్పడ్డాడు. స్టోర్ పార్కింగ్ ప్రదేశంలో ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డారు. నల్ల జాతీయులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
ఇక కాల్పులు జరుపుతున్న క్రమంలో దుండగుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కాసేపటికి అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మృతుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. జాత్యాహంకారంతోనే దుండగుడు వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.