Gunshooting in USA: అమెరికాలోని షాపింగ్ మాల్ లో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి
Gunshooting in USA: ఇండియానాలోని గ్రీన్ వుడ్ నగరంలో ఆదివారం సాయంత్రం కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గ్రీన్ వుడ్ నగరంలోని గ్రీన్ వుడ్ పార్క్ షాపింగ్ మాల్ లో చోటుచేసుకుంది. గన్ తో షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి మాల్ వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పోలీసులు మట్టుపెట్టారు. షాపింగ్ మాల్లో కాల్పుల ఘటనను చూసిన వారు తమను సంప్రదించి వివరాలు తెలపాలని గ్రీన్వుడ్ పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. దుండగుడిని కాల్చి చంపినట్లు గ్రీన్ వుడ్ మేయర్ మార్క్ మయేర్స్ పేర్కొన్నారు.
ఉవాల్డే, బఫెలో, టెక్సాస్‌లలో ఇటీవల జరిగిన సామూహిక కాల్పుల ఘటనలు దేశంలో సంచలనం సృష్టించిన తర్వాత,
అమెరికాలో గన్ కల్చర్ కు వ్యతిరేకంగా యూఎస్ ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా ఎలాంటి మార్పులు రావడంలేదు. అంతేకాదు, ఇటీవల కాలంలో ఈ గన్ షూటింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కాల్పుల కారణంగా ప్రతీ ఏడాది సుమారు 40 వేల మంది అమెరికన్ పౌరులు మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నెల 4న కూడా చికాగోలో ఓ దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35 మంది గాయాలపాలయ్యారు.