Firing in California: అమెరికాలో కాల్పుల కలకలం
Firing in California: అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది.. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొనేలోపు నిందితులు పరారయ్యారు. దాడి హింస వెనుక పెద్ద ఉద్దేశ్యం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉందని భావిస్తున్నారు
ఈ సంఘటనలో కనీసం ఇద్దరు అనుమానితులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుటుంబంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించిన రెండు గ్యాంగ్ లు ఉన్నట్లు సమాచారం అందుతుందన్నారు పోలీసులు. వారం రోజుల క్రితం ఆ నివాసంలో నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. మాదక ద్రవ్యాలు నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు జరిపిన వారంరోజుల అనంతరం ఆ ఇంటిపై గుర్తుతెలియని ముఠా సభ్యులు దాడి చేయడంతో దీని వెనక పెద్ద ముఠాఉందని పోలీసులు భావిస్తున్నారు.