Sundar pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్క టెక్ రంగంలోనే (Tech industry) కాకుండా అనేక రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. మానవ పనులను తేలిక పరుస్తూ రోజురోజుకు మరింత ఆదరణ పొందుతోంది.
Sundar pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్క టెక్ రంగంలోనే (Tech industry) కాకుండా అనేక రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. మానవ పనులను తేలిక పరుస్తూ రోజురోజుకు మరింత ఆదరణ పొందుతోంది. మనిషి గంటలు, రోజుల్లో చేసే పనిని చిటికెలో చేసి చూపెడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. తెలియకుండానే అందరూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజులో ఒక్కసారైనా ఏఐని (AI) వినియోగిస్తున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ విస్తరిస్తుండడంతో ఉద్యోగాలు (JOBS) ఊడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ఏఐ రిప్లేస్ చేసేసింది. మరోవైపు ఏఐతో ఫాస్ట్‌గా, కచ్చితమైన ఔట్పుట్ వస్తుందని చాలా కంపెనీలు దానిపై ఆధారపడడం మొదలు పెట్టాయి.
ఇదిలా ఉండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google ceo sundar pichai).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో స్మార్ట్ఫోన్లు (Smart phones) కొత్త పుంతలు తొక్కుతాయని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఏఐ మనుషులకు ప్రతికూలంగా వ్యవహరించదని, కంప్యూటర్ల వంటి టెక్నాలజీ టూల్స్‌ను (Technology tools) మానవులకు నిజమైన సేవకులుగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమేనన్న సుందర్ పిచాయ్.. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సహజంగా మనం ఇంటరాక్ట్ అయ్యేందుకు సరళంగా మారుతుందని అన్నారు. త్వరలో ఏఐ మానవ భాషను మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే కొద్దిరోజుల క్రితం గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా పేరు పొందిన జెఫ్రీ హింటన్ కూడా ఏఐపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో ఎంతో ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఏఐ గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఏకంగా గూగుల్ కంపెనీకే హింటన్ రాజీనామా చేశారు. ఏఐ చాట్‌బాట్‌తో ప్రమాదం ఉందని గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పానని.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని హింటన్ వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ చాట్‌బాట్ అంత ఇంటెలిజెంట్‌గా లేదని, కానీ భవిష్యత్తులో ఆ టెక్నాలజీ మరింత రాటుదేలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవ మస్తిష్కాన్ని మించి చాట్ బాట్ టేకోవర్ చేస్తుందని వెల్లడించారు.