అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు (International Space Station) నలుగురు వ్యోమగాములు (Astronauts) పయనమయ్యారు.
ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు (International Space Station) నలుగురు వ్యోమగాములు (Astronauts) పయనమయ్యారు. నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ రాకెట్ (Space X Rocket) ద్వారా నింగిలోకి దూసుకెళ్లారు. అమెరికాలోని కేప్ కెనవెరాల్ నుంచి రాకెట్ నింగిలోకి వెళ్లింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఆదివారం నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ వద్దకు చేరుకోనున్నారు.
ఐఎస్ఎస్‌కు పయనమైన వారిలో ఒకరు నాసాకు (NASA) చెందిన వారు కాగా.. మిగతా ముగ్గురు రష్యా, జపాన్, డెన్మార్క్‌కు చెందిన దేశస్థులు. ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాములు తిరిగి భూమిపైకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో వారి స్థానంలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే ఉండనున్నారు. అయితే నాలుగు వ్యోమగాములను నాసా ఐఎస్ఎస్‌కు పంపించడం ఇదే మొదటిసారి. ప్రతిసారి ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను మాత్రమే పంపించేంది. అలాగే వేర్వేరు దేశాలకు చెందిన వారిని పంపించడం కూడా ఇదే మొదటిసారి. ఇక ప్రస్తుతం ఐస్ఎస్ఎస్ వెళ్తున్న బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్‌బెలి నాయకత్వం వహిస్తున్నారు.