అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. ఈ మేరకు జార్జియా రాకేటీరింగ్ కేసులో జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
America : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్ట్ అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు(America Presidential Elections) సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. ఈ మేరకు జార్జియా రాకేటీరింగ్ కేసులో(Georgia Racketeering case) జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి 2 లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్(Bail) తీసుకునేందుకు అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో(Four criminal cases) ఇదొకటి.
కాగా, డొనాల్డ్ ట్రంప్ జైలులో 20 నిమిషాలు గడిపిన తర్వాత ఆయనకు బెయిల్ లభించడంతో బయటికి వచ్చారు. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. ఇలా కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులు ఆయన ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అమెరికా ప్రజలకు తనపై పూర్తి నమ్మకం ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. తనకు అమెరికా ప్రజలే మొదటి ప్రాధాన్యత అని అంటున్నారు.