America : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
America: అమెరికాలోని తెలుగు విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది గంపెడు ఆశలతో భవిష్యతుకు బంగారు బాటలేసుకుందామని పరాయి దేశమెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడి తూటాలకు బలవుతున్నారు. నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు. ఆ సంఘటన మరువకముందే కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ దుండగుడు ఏడుగురిని కాల్చిచంపాడు.
చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు తెలుగు విద్యార్థుల్లో ఒకరు దుర్మణం చెందారు. చరణ్, దేవాన్ష్‌లు ఓ రోడ్డులో నడుచుకుంటూ వెళుతుండగా కొందరు కారులో వచ్చి వారిని అడ్డగించారు. వారి వద్ద ఉన్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు యత్నించగా నిందితులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన దేవాన్ష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. హైదరాబాదీ విద్యార్థి సాయిచరణ్ పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు.