Sydney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sydney) నగరంలో భారీ ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్లో (Building) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంలో మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో పాటు పక్కనే ఉన్న బిల్డింగ్లకు కూడా అంటుకున్నాయి.
Sydney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sydney) నగరంలో భారీ ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్లో (Building) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంలో మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో పాటు పక్కనే ఉన్న బిల్డింగ్లకు కూడా అంటుకున్నాయి. ఆ తర్వాత మంటల ధాటికి బిల్డింగ్ కుప్పకూలిపోయిది.
సిడ్నీ నగరంలోని సర్సీహిల్స్లో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్సీహిల్స్లో ఉన్న ఏడంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. క్రమంగా భారీగా మంటలు ఎగిసి పడుతూ దట్టమైన పొగలతో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో చుట్టుపక్కల భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. మంటలు దాటికి భవనం మొత్తం పూర్తిగా కాలిపోయి.. కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 20 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కన ఉన్న భవనాల్లోని జనాలను ఖాళీ చేయించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ మొత్తం ఖాళీగా ఉండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. కొంతకాలంగా ఆ బిల్డింగ్ ఖాళీగానే ఉందని.. నిరాశ్రయులు కొందరు ఆ భవనంలో ఆశ్రమం పొందున్నారని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బిల్డింగ్ ముందు పార్క్ చేసి ఉంచిన కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు.