దక్షిణాఫ్రికాలో (South Africa) భారీ అగ్నిప్రమాదం (Fireaccident) జరిగింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ బిల్డింగ్‌లో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
FireAccident: దక్షిణాఫ్రికాలో (South Africa) భారీ అగ్నిప్రమాదం (Fireaccident) జరిగింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ బిల్డింగ్‌లో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ.. దట్టమైన పొగలతో చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 63 మంది సజీవదహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బిజినెస్ డిస్టిక్ట్ర్లోని ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా చుట్టుపక్కల బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దాదాపు 50 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత అధికారులు భవనంలోపల సహాయక చర్యలు చేపట్టి 63 మృతదేహాలను గుర్తించారు. అలాగే 43 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అర్థరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో.. భారీగా ప్రాణనష్టం సంభవించిందని వెల్లడించారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.