America: ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలు దేశాలు దివాలా తీశాయి. శ్రీలంక(Srilanka), పాకిస్థాన్‌తో (Pakistan) పాటు మరికొన్ని దేశాలు అస్థవ్యస్తమయ్యాయి. తమ దేశ ఎంబసీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టాయి. మరికొన్ని దేశాలు కూడా దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంది అగ్రరాజ్యం అమెరికా (America). ఓ వైపు పెరిగిపోయిన అప్పులు.. మరోవైపు కొత్త అప్పులు తీసుకోవడానికి కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడంతో బైడెన్ సర్కార్ చిక్కుల్లో పడిపోయింది.
America: ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలు దేశాలు దివాలా తీశాయి. శ్రీలంక(Srilanka), పాకిస్థాన్‌తో (Pakistan) పాటు మరికొన్ని దేశాలు అస్థవ్యస్తమయ్యాయి. తమ దేశ ఎంబసీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టాయి. మరికొన్ని దేశాలు కూడా దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంది అగ్రరాజ్యం అమెరికా (America). ఓ వైపు పెరిగిపోయిన అప్పులు.. మరోవైపు కొత్త అప్పులు తీసుకోవడానికి కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడంతో బైడెన్ సర్కార్ చిక్కుల్లో పడిపోయింది. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడం బైడెన్ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.
పరిమితి పెంచేదే లేదు..
ఇప్పటికే అమెరికా దేశ జీడీపీ కంటే అధికంగా అప్పులు చేసింది. 2021 నాటికి అమెరికా తీసుకున్న అప్పులు 28.5 ట్రిలియన్ డాలర్లు కాగా.. ఇది దేశ జీడీపీ కంటే 24 శాతం అధికం కావడం గమనార్హం. ఇక అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఆ పరిమితిని పెంచాలని బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతిని కోరుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ పెంచేది లేదని తేల్చి చెబుతోంది. ఎందుకంటే అమెరికా కాంగ్రెస్‌లో ఎక్కువ మంది రిపబ్లికన్లే ఉన్నారు. దీంతో అప్పుల పరిమితిని పెంచేది లేదని, భవిష్యత్ ఖర్చులను తగ్గించుకోవాలని కాంగ్రెస్, బైడెన్ సర్కార్‌కు సూచిస్తోంది. దీంతో బైడెన్ సర్కార్‌కు తిప్పలు తప్పడం లేదు.
ఇప్పటి వరకు 78 సార్లు..
వందేళ్ల క్రితం కాంగ్రెస్, అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులపై పరిమితిని విధించింది. అయితే ఆ తర్వాత అవసరాలకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేశారు. గడిచిన వందేళ్లల్లో దాదాపు 78 సార్లు అప్పుల పరిమితిని కాంగ్రెస్ సవరించింది. ఇప్పుడు కూడా అధ్యక్షుడు బైడెన్ అప్పుల పరిమితి పెంచాలని కోరుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లదే పైచేయి ఉండడంతో అతనికి నిరాశే ఎదురవుతోంది.
ఆలోగా పరిమితి పెంచకపోతే..
జూన్ ఒకటి నాటికి కాంగ్రెస్ అప్పుల పరిమితిని పెంచకపోతే బైడెన్ సర్కార్ దివాళా తీయడం ఖాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ ఇప్పటికే చేతులెత్తేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల పరిమితి పెంచకపోతే ప్రభుత్వం చెల్లింపులు ఆగిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. వెంటనే కాంగ్రెస్ అప్పుల పరిమితిని పెంచాలని కోరారు. ఇప్పటి వరకు అమెరికాలో ప్రభుత్వ చెల్లింపులు జరపలేని పరిస్థితి రాలేదు. ఒకవేళ కాంగ్రెస్ అప్పుల పరిమితిని పెంచకపోతే ఆ పరిస్థితి మొదటిసారి వచ్చే అవకాశం ఉంది.
దివాళా తీస్తే..
ఒకవేళ అదేగనుక జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర ఖర్చులు అన్నీ ఆగిపోనున్నాయి. వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోనున్నాయి. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడి జీవనం సాగించే వారు చిక్కుల్లో పడిపోనున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోనున్నాయి. అటు డాలర్ రేటు కూడా దారుణంగా పడిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అమెరికా నాయకత్వానికి దెబ్బ పడనుంది. అమెరికాపై ఆధార పడిన దేశాలన్నీ సంక్షోభంలో చిక్కుకోనున్నాయి. దాదాపు 80 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. అటు భారత్‌పై కూడా ఈ ఎఫెక్ట్ చూపనుంది. ఉద్యోగ రిత్యా భారత్‌కు వెళ్లిన వాళ్లంతా చిక్కులో పడిపోనున్నారు. చాలా మంది ఉద్యోగాలు ఊడే అవకాశం కూడా లేకపోలేదు.