FBI Raids on US President House: అమెరికా అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
FBI Raids on US President House: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఆయన ఇంటిపై దాడులు నిర్వహించి ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సుమారు 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే, ఈ ఆరు కీలక పత్రాలు దేనికి సంబంధించినవన్నది అధికారులు తెలియజేయలేదు. గత కొంతకాలంగా జోబైడెన్ ఒకదాని తరువాత మరోకటిగా సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలే తన పాత కార్యాలయంలో 10 రహస్య పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఇప్పుడు మరో ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో అమెరికా అధ్యక్షుడు మరింత చిక్కుల్లో పడిపోయారు. గత అధ్యక్షుడు ట్రంప్ నివాసంలోనూ అధికారులు 30కిపైగా రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్షులపై వరసగా అధికారులు దాడులు నిర్వహిస్తుండటంతో పాలనా పరమైన చిక్కులు వచ్చే అకవాశాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ యుద్ధానిలకు దూరంగా ఉంటూ అమెరికా అభివృద్ధికి దొహదపడితే, జో బైడెన్ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉక్రెయిన్ కు ఆయుధాల సహకారంతో పాటు, నిధులను కూడా భారీ ఎత్తున సహాయం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోమాలియీలోనూ అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది.