Rishi Sunak: చైనాపై రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు
China is Biggest Threat: చైనాపై బ్రిటన్ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి కి చెందిన రిషి సునాక్ చైనా పై సంచలన కామెంట్స్ చేశాడు. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పాడు. అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని అన్నాడు. రిషి సునాక్ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేయడంతో రిషి సునాక్ మాట్లాడాడు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి చైనా ప్రమాదకరమని అని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. యునైటెడ్ కింగ్డమ్ – చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల పేర్కొంది.
తాను ప్రధాని పదవి చేపడితో చైనా పట్ల సీరియస్‌గా వ్యవహరిస్తానని రిషిఅన్నాడు. బ్రిటన్‌లోని 30 ఇన్స్టిట్యూట్లను మూసేస్తానని దీంతో చైనా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామన్నారు. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తామన్నారు. రష్యా చమురును కొనుగోలు చేస్తూ విదేశాల్లో వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా మద్దతుగా నిలుస్తోందన్నారు.
అలాగే.. జింజియాంగ్, హాంకాంగ్‌లలో తమ ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వారి జీతాలను తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు