England Emergency: ఇంగ్లాండ్ లో ఎమర్జెన్సీ..ఇదే కారణం
England Emergency: యూరప్ దేశాల్లో ఎప్పుడూ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతుంటాయి. అయితే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత కొన్నేళ్లుగా అక్కడ పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటితేనే బాబోయ్ అనేస్తారు. అయితే , ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్లో ఎమర్జెన్సీని విధించారు. ఉదయం సమయంలో అత్యవసరమైతేనే తప్పించి బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
లండన్ నగరంతో పాటు బ్రిటన్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని బ్రిటన్ వాతావరణ శాఖ పేర్కొన్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం అనారోగ్యం బారిన పడతారని హెచ్చరించింది. ఇంటి లోపల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోడవుతుండటంతో ప్రజలు ఉపశమనం కోసం బీచ్ లకు పరుగులు తీస్తున్నారు.