Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
Elon Musk: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా,ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఎలాన్ మస్క్ నెట్ వర్త్ 187.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ ఓనర్, సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 185.3 బిలియన్ డాలర్లు ను ఎలాన్ మస్క్ వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుడిగా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
2021లో నవంబర్‌లో 340 బిలియన్ డాలర్లుగా ఉన్న మస్క్ ఆస్తులు గతేడాది చివర్లో దాదాపు 137 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఆయన తర్వాత రెండో స్థానానికి పడిపోయారు. తాజాగా ఆయన సంపద 36 శాతం పెరగడంతో తిరిగి తొలి స్థానంలోకి వచ్చారు. భారత కుబేరుడు గౌతం అదాని 37.7 బిలియన్ డాలర్లతో 32వ స్థానానికి పతనమయ్యారు. ముకేష్ అంబాని 81.1 బిలియన్ డాలర్లతో టాప్ 10 స్థానంలో నిలిచారు.