Elon musk: టెస్లా సీఈవో, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ( Elon Musk) మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు.
Elon musk: టెస్లా సీఈవో, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ( Elon Musk) మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక అగ్రస్థానం నుంచి కిందికి దిగజారిన మస్క్.. మళ్లీ పుంజుకొని ఫస్ట్ ప్లేస్‌కు వచ్చారు. గతేడాది డిసెంబర్లో ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ ( Bernard Arnault) మస్క్‌ను దాటేసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే బుధవారం బెర్నాల్డ్ 2.6 శాతం సంపదను కోల్పోయారు. దీంతో మళ్లీ మస్క్ అగ్రస్థానానికి చేరుకున్నారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక మస్క్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆయన షేర్లన్నీ కుప్పకూలిపోయాయి. అదే సమయంలో టెస్లా అమ్మకాలు తగ్గిపోయాయి. అటు స్పేస్ఎక్స్ రాకెట్ కూడా పేలిపోయింది. దీంతో మస్క్ షేర్లన్నీ ఆవిరయ్యాయి. ఆయన వ్యక్తిగత సంపద అంతా తరిగిపోయింది. మస్క్ షేర్లు ఆవిరయిన సమయంలో.. ఎల్ఎంవీహెచ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో గతేడాది డిసెంబర్లో బెర్నాల్డ్ ఆర్నాల్ట్ అగ్రస్థానికి చేరుకున్నారు.
అయితే ప్రస్తుతం ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో బెర్నాల్ట్ షేర్లు క్రమంగా పతనమవుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటి 10 శాతానికి పైగా తగ్గాయి. ఈ సమయంలో టెస్లా షేర్లు మళ్లీ పెరగడం ప్రారంభమయింది. ఇది ఎలాన్ మస్క్‌కు కలిసి వచ్చింది. బుధవారం బెర్నాల్డ్ 2.6 శాతం సంపదను కోల్పోవడంతో మస్క్ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. బెర్నాల్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది.