Edible Oil Shortage in Pakistan: పాక్‌లో దుర్భర పరిస్థితులు… మూడు వారాలకే నిల్వలు
Edible Oil Shortage in Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు గ్యాస్ సిలీండర్లు, పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు సైతం భారీగా పెరిగిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా నూనె, నెయ్యికి సైతం భారీ కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే నిల్వలు ఉన్నాయి.
నిల్వలు తగ్గిపోతుండటంతో కోతలు విధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కొరత మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది. కొరత పెరిగే కొలది ధరలు పెరుగుతాయని, ప్రజలు నూనె వస్తువులను వినియోగించడం తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. నూనెకు సంబంధించిన దిగుమతులు తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం మూడు నెలలకు సరిపడా మాత్రమే ఉన్నట్లు ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఆర్థిక ఇబ్బందుల నుండి పాక్ బయటపడాలంటే కనీసం 30 బిలియన్ డాలర్ల సాయం అవసరం అవుతుంది. దీంతో ఈ సాయం కోసం వివిధ దేశాలను సంప్రదిస్తున్నది. ఇప్పటికే అమెరికా మానవతాసాయం కింద కొంత మొత్తాన్ని అందించింది. అయితే, పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి వాటిని అరికడితే సాయం అందించేందుకు చాలా దేశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు భారత్‌తో కూడా పాక్ కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నా, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం అవుతున్నది.