Pakistan Economic Crisis: పాక్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం… అమ్మకానికి రాయబార కార్యాలయాలు
Pakistan Economic Crisis: చైనాపై ఆధారపడే దేశాలు ఏ స్థాయిలో దిగజారిపోతాయే శ్రీలంకను చూస్తే ఇప్పటికే అర్థమౌతుంది. తాజాగా పాకిస్తాన్ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా అస్థిరతను ఎదుర్కొంటున్నది. పాక్‌లో ద్రవ్యోల్భణం రేటు 42 శాతానికి పెరిగింది. డాలర్‌తో పాక్ రూపాయి విలువ 228కి చేరింది. ఇక విదేశీ మారక నిల్వలు కేవలం 5.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండటం, ఎగుమతులు లేక దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో దేశంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని అక్కడి ఆర్థిక, రాజకీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు వివిధ దేశాల్లోని ఎంబసీలను అమ్మాకాలకు పెడుతున్నారు. దేశంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వ్యాపార సముదాయలు కేవలం రాత్రి 8:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని ఆదేశించారు. విద్యుత్ కొతలతో విలవిలలాడిపోతున్నది. ఇలా విద్యుత్ కోతల ద్వారా 600 కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని పాక్ ఆలోచిస్తున్నది. ఇక ఆర్థికంగా ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను ఇప్పటికే అనేకమార్లు విజ్ఞప్తి చేసింది.
800 కోట్ల డాలర్ల మేర రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా అనేక షరతులు విధించడంతో, సౌది అరేబియా చుట్టూ అధికారులు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడాలంటే సుమారు 30 బిలియన్ డాలర్ల నిధులు అవసరమౌతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం, పాక్‌లోని ఖైబర్ ఫంక్తూ రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే పాక్ చరిత్రలో అత్యంద దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లే అవుతుంది.