Indonesia: ఇండోనేషియా సుమత్రా ద్వీపం తీరంలో భూకంపం
Earthquack in Sumatra in Indonesia
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భూకంపం సంభవించింది. అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సోమవారం ఉదయం 6.30 గంటలకు సంభవించిన భూకంపం వల్ల పలు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూమి కదుపులకు లోనవ్వడంతో ఏం చేయాలో తోచక టెన్షన్ పడ్డారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది.
ఇండోనేషియా దేశం తరచుగా భూకంపాలకు లోనవుతూ ఉంటుంది. గత కొన్నేళ్లలో వచ్చిన భూకంపాల వల్ల వందలాది మంది చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. టెక్టానిక్ ప్లేట్లు కొలిజన్ వల్ల ఇండోనేషియాలో తరచు భూకంపాలు సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది నవంబర్ 21న వెస్ట్ జావా ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.6 తీవ్రత కలిగిన భూకంపం రావడంతో 602 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం సంభవించగానే పెద్ద పెద్ద బిల్డింగులు నేల మట్టం అవుతున్నాయి. వాటిలో చిక్కుకుని వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.