అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి (3rd world war) దారి తీయొచ్చని వ్యాఖ్యానించారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) వరుసగా కేసులు వెంటాడుతున్న విషయం తెలిసిందే. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నిల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న క్రమంలో ట్రంప్ వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై (Joe Biden) ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి (3rd world war) దారి తీయొచ్చని వ్యాఖ్యానించారు.
జో బైడెన్‌కు పూర్తిగా మతి భ్రమించిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దుల విషయంలో బైడెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుల వద్ద ఎటువంటి రక్షణ గోడ లేకపోవడంతో.. దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు దేశ భవిష్యత్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. ఆయన మానసిక పరిస్థితి ద్వారా విపత్తు సంభవించవచ్చన్న.. అనాలోచన నిర్ణయాల వల్ల మూడో ప్రపంచ యుద్ధం కూడా సంభవించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.