Donald Trump: రాణి ఎలిజబెత్, డయానా పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Donald Trump: వివాదాలకు కేంద్ర బిందువైన యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాణి ఎలిజబెత్-2, ప్రిన్సెస్ డయానా, ఓప్రా విన్‌ఫ్రే పై కీలక వ్యాఖ్యలు చేసాడు. లెటర్స్ టు ట్రంప్’ పుస్తక ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. క్వీన్ ఎలిజబెత్, డయానా నా విధేయులని తన అడుగులకు మడుగులొత్తేవాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ఇదే చేశారని వెల్లడించారు. వాళ్లలో దాదాపు సగం మంది నా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేంత విదేయులని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు ప్రచురణకర్త విన్నింగ్ పబ్లిషింగ్ తెలిపింది. ఇదిలావుంటే.. రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తన తండ్రి పట్ల ఈ ప్రముఖులంతా భిన్నంగా ప్రవర్తించారని ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్ ట్రంప్ జూనియర్ అన్నారు. నా తండ్రి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత వాళ్లల్లో మార్పును చూసి ఆశ్చర్యపోయానని ట్రంప్ కుమారుడు తెలిపాడు