Trump: ఏ క్షణంలోనైనా తనను అరెస్ట్ చేయచ్చు.. ట్రంప్
Trump: ఏ క్షణంలోనైనా తనను అరెస్ట్ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు . అవినీతిమయమైన, తీవ్రమైన రాజకీయం జోక్యం కలిగిన మాన్‌హట్టాన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి ఈ సమాచారం బయటకు పొక్కిందని తెలిపారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన వెల్లడించారు. ‘‘రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థి, దేశ మాజీ అధ్యక్షుడిని వచ్చే మంగళవారం అరె స్టు చేయనున్నారు. ఒకవేళ అదే జరిగితే నిరసనలు చేయండి. దేశాన్ని వెనక్కి తీసుకోండి’’ అని నిరసనకారులకు ఆయన పిలుపునిచ్చారు.
కోటీశ్వరుడు జార్జ్ సొరొస్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌తో తనకున్న సంబంధాన్ని బయటకు వెల్లడించకుండా ఉండటానికి 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ ఆమెకు రూ.1 కోటి చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఇప్పుడు రంగం సిద్దమైనదని అన్నారు. అయితే ఈ ఆరోపణనలు ట్రంప్ కొట్టిపడేసారు.