AI Robots: ఉపద్రవాలను ఈ రోబోలు ముందుగానే గుర్తిస్తాయి…
AI Robots: ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. కరోనా నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొత్త వేరియంట్ రూపంలో ఇబ్బందులు పెడుతున్నాయి. అసలు రాబోయే ఉపద్రవాలను ముందుగానే ఊహించి హెచ్చరిస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు కదా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నాచు. అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను వినియోగించుకొని పరిశోధనలు చేస్తున్నారు. భూకంపాలు, సునామీలు, కరోనా వంటి మహమ్మారులను గుర్తించేందుకు అవసరమైన ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు బేయర్ క్రాప్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
డ్రైవర్ లెస్ కార్లు, సిరి అండ్ అలెక్సా టెక్నాలజీని వినియోగిస్తున్నాము. రాబోయే ఉపద్రవాలను గుర్తించేందుకు పెద్ద డేటా అవసరం లేదని, అందుబాటులో ఉన్న చిన్న మొత్తంలో డేటాను వినియోగించుకొని ఏఐ రోబోలు ముందుగానే హెచ్చరించే విధంగా అభివృద్ధి చేస్తున్నామని బేయర్ క్రాప్ రీసెర్చ్ కి నేతృత్వం వహిస్తున్న ఈతాన్ పికరింగ్ తెలిపారు. ప్రకృతి విపత్తులను, కరోనా మహమ్మారి వంటి వైరస్‌లను, వాటి వేరియంట్‌లను ముందుగానే గుర్తించే విధంగా రోబో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే చాలా వాటి నుండి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇదికూడా సాధ్యమౌతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.