China Covid 19: కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్
China Covid 19: కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. కోట్లాది మంది దీని బారిన పడగా, లక్షలాది మంది మరణించారు. ఉద్యోగాలు కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కరోనా పుట్టినిల్లైన చైనాలోనే కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆందోళన చెందుతున్నాయి. ఈ వైరస్ తిరిగి ప్రపంచ దేశాల్లో విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, కోవిడ్ 19 వైరస్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదని, మానవనిర్మితమైనదేనని, ఇది వూహాన్ ల్యాబ్ నుంచే లీకయిందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు తన ది ట్రూత్ ఎబౌట్ వూహాన్ పుస్తకంలో పేర్కొన్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన వైరస్ అయితే ఇంతకాలం పాటు తన ప్రభావాన్ని చూపలేదని, ఎన్ని దిశలు, దశలు మార్చినా వ్యాక్సిన్‌లకు లొంగిపోతుందని, కానీ, మానవనిర్మితమైన వూహన్ వైరస్ వ్యాక్సన్లను తప్పించుకొని మరలా విజృంభిప్తున్నట్లు ఆండ్రూ హాప్స్ పేర్కొన్నారు. పరిశోధనల క్రమంలో ల్యాబ్‌లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని పేర్కొన్నారు.