Post Covid 19 Issues: కోవిడ్‌తో కొత్త సమస్యలు… అవయవాలు డ్యామేజీ
Post Covid 19 Issues: కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురి చేసింది. కరోనా కారణంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ పోస్ట్ కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ లక్షణాలు బయటపడ్డ ఏడాది తరువాత కొత్త సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఇప్పటికీ అనేకమందిని దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏడాది తరువాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
దీనిపై పరిశోధనలు చేసిన బ్రిటన్ పరిశోధకులు కీలక విషయాలను జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటి ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురికి ఒక అవయవం దెబ్బతింటున్నదని, ప్రతి నలుగురిలో ఒకరికి మల్టీ ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయని స్పష్టం చేసింది. ఈ పరిశోధనల తరువాత అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. గుండె జబ్బుల వంటి వాటికి కూడా కరోనా మహమ్మారి ఒక కారణం అవుతోందని కూడా పరిశోధనలలో తేలింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, ఈ వైరస్ ఏదో ఒకరూపంలో మానవాళిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నది.