చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5 బీ గురించి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ రాకెట్ ఇటీవలే న్యూ తీయాంగ్ గ్యాంగ్ అంతరిక్ష కేంద్రం కోసం చివరి మాడ్యూల్ ను తీసుకొని వెళ్ళింది. విజయవంతంగా డాక్ చేసిన రాకెట్ అక్కడి పనులు ముగించుకొని తిరిగి భూమి మీదకు రానున్నది.
China Rocket: చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5 బీ గురించి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ రాకెట్ ఇటీవలే న్యూ తీయాంగ్ గ్యాంగ్ అంతరిక్ష కేంద్రం కోసం చివరి మాడ్యూల్ ను తీసుకొని వెళ్ళింది. విజయవంతంగా డాక్ చేసిన రాకెట్ అక్కడి పనులు ముగించుకొని తిరిగి భూమి మీదకు రానున్నది. ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించి భూవాతావరణంలోకి ఎంటరయ్యాక రాకెట్ లోని కొంతభాగం కాలిపోతుంది. కాలిపోయిన రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. అయితే, ఇవి ఎక్కడ పడతాయి అనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రాకెట్ శకలాలు స్పెయిన్ మీదుగా వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా స్పెయిన్ విమానాశ్రయాలను మూసివేసింది. గగన తలంపై నిషేధం విధించింది. చైనా రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయే స్పష్టంగా తెలియదని, ముందు జాగ్రత్తలో భాగంగా విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు తెలియజేసింది. ఇక, విమానాశ్రయాల మూసివేత విషయాన్ని ప్రయాణికులకు తెలియజేశామని స్పెయిన్ అధికారులు తెలిపారు.