China: యుద్దానికి సిద్దమేనా..సైనికులతో జిన్‌పింగ్
China: తూర్పు లడఖ్‌లోని ఇండియా-చైనా బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికుల సంసిద్ధతను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిశీలించారు. వర్చువల్ విధానంలో సైనికులతో మాట్లాడినట్టు సమాచారం. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్ ఆధ్వర్యంలో ఉన్న ఖున్జెరబ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని జిన్‌పింగ్ పరిశీలించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిన్‌పింగ్ పీఎల్ఏకు చీఫ్ కమాండర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. సైనికులతో జిన్‌పింగ్ మాట్లాడిన వీడియోను అధికారిక మీడియా విడుదల చేసింది.
ఇప్పుడు సరిహద్దులో డైనమిక్, 24 గంటల పర్యవేక్షణను నిర్వహిస్తున్నామని సైనికుల్లో ఒకరుజిన్‌పింగ్ కు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సైనికుల పరిస్థితి ని ఆయన అడిగి తెలుసుకున్నారు. . తర్వాత వారి యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏ పరిస్థితిలోనైనా యుద్దానికి సిద్డంగా ఉండాలని వారికీ తెలిపారని తెలుస్తుంది.
తూర్పు లడఖ్ ప్రాంతంలో సరస్సు వద్ద 2020 మే 5వ తేదీన భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. తూర్పు లడఖ్ ప్రాంతం తమదంటే తమదని ఇండియా, చైనా ఘర్షణ పడుతున్నాయి. సరిహద్దు రక్షణలో ఆదర్శప్రాయులని సైనికులను ఆయన ప్రశంసించారని తెలిపింది. పట్టుదలతో పని చేయాలని, మరిన్ని సేవలు అందించాలని ప్రోత్సహించారని చైనా మీడియా తెలిపింది.