China lockdown: చైనాలో ఫ్లూ పంజా.. మళ్లీ లాక్‌డౌన్
China lockdown: కరోనా పుట్టినిల్లు చైనాలో ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా యంత్రాంగం అప్రమత్తం అయింది. గత వారంలో ప్లూ కేసులు 24 శాతం వరకు ఉండగా, వారం వ్యవధిలో ఏకంగా 48 శతానికి చేరింది. దీంతో చైనా యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. దీనికోసం యంత్రాంగం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. అయితే, కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టినట్లుగా యంత్రాంగం స్పష్టం చేసింది. 8 శాతం నుండి 5 శాతానికి పడిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయోంజా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా తరహాలోనే కేసులు పెరుగుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. చైనాలోని జియాన్ ప్రావిన్స్‌లో కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఆ ప్రాంతంపై తొలుత దృష్టి సారించారు. అయితే, వ్యాపారాలు లేక నష్టపోతున్నామని, ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ అంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని, లాక్‌డౌన్ కంటే వ్యాక్సిన్ అందించాలని ప్రజలు వాపోతున్నారు. లాక్‌డౌన్ పెట్టుకుంటూ పోవడం వలన ఉపయోగం ఉండదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీవన విధానం కనిష్టస్థాయికి పడిపోయిందని, ప్రతిసారి ఇలా లాక్ డౌన్ పెట్టడం వలన తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.