China Govt key instruction on Covid 19 Deaths: కోవిడ్ మరణాలపై చైనా ప్రభుత్వం కీలక సూచనలు
China Govt key instruction on Covid 19 Deaths: చైనాలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. రోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనాతో మరణిస్తున్నారు. ఈనేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనాతో మృతి చెందినప్పటికీ, ఆ మరణాన్ని కరోనా మరణంగా దృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇవ్వొద్దని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. దానికి బదులుగా అతని అనారోగ్యాన్ని సూచిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలని పేర్కొన్నది.
ఒకవేళ ఆ వ్యక్తికి అనారోగ్యం లేకుండా కేవలం కోవిడ్‌తో మాత్రమే మరణించి ఉంటే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని, వారు రెండంచెల పరిశీలన తరువాత మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారని చైనా నోటీసుల్లో పేర్కొన్నది. కరోనా మరణాల సంఖ్యను కప్పిపుచ్చేందుకే ఇలాంటి సూచనలు చేసినట్లు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు, మరణాల గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు ఇప్పటికే పలుమార్లు సూచించింది. కానీ, ఆ దేశంలో ఎలాంటి మార్పు రాలేదు. కేసుల సంఖ్యను ఇతిమిత్తంగా ప్రకటించడం లేదు. ఇప్పటికే చైనాలు గడిచిన రెండు నెలల కాలంలో సుమారు 60 వేల మందికి పైగా కరోనాతో మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉన్నది.