China Covid 19: చైనాలో కోవిడ్ కల్లోలం… శవాలతో మార్చురీలు పుల్
China Covid 19: చైనాలో కరోనా కేసులు లక్షల సంఖ్యలో నమోదువుతున్నాయి. కేసులతో పాటు ఉదృతి కూడా పెరుగుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రోగులే కనిపిస్తున్నారు. వైద్య సదుపాయాల కొరత ఆ దేశంలో తీవ్రంగా కనిపిస్తున్నది. కేసులతో అల్లకల్లోలంగా మారడంతో వైద్యారోగ్యశాఖ చేతులెత్తేసే పరిస్థితులు సంభవించాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల వివరాలను ఆ దేశం బయటపెట్టడం లేదు. చిన్న ఆసుపత్రుల నుండి కార్పోరేట్ ఆసుపత్రుల వరకు కరోనా రోగులతోనే నిండిపోయింది. ఆసుపత్రుల్లోని మార్చురీలు సైతం శవాలతో నిండిపోయింది.
రోజుకు 9 వేల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత ఉదృతంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజింగ్‌లోనూ ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రుల బెడ్‌లతో పాటు ఐసీయు యూనిట్లు సైతం ఫుల్ కావడంతో బీజింగ్‌లో అత్యవసర పరిస్థితులు విధించారు. కారిడాళ్లు, వెయిటింగ్ హాళ్లలో రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రుల నిర్మాణాలు చేపడుతున్నా సరిపోవడం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
2019లో చైనాలోని వూహాన్ నగరంలోని వైరాలజీ ల్యాబ్ నుండి లీకైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి అల్లకల్లోలం సృష్టించింది. గత మూడేళ్లుగా కరోనా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, రూపం మార్చుకొని కొత్త శక్తితో కరోనా వైరస్ దాడి చేస్తున్నది. కోట్లాది మంది వైరస్ బారిన పడగా, లక్షలాది మంది ఇప్పటికే మృతి చెందారు. ఇప్పటికైనా చైనా కరోనాకు సంబంధించి సరైన డేటాను బయటపెట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్త సైతం విజ్ఞప్తి చేస్తున్నది.