China Defense Budget Increased: మరోసారి రక్షణ బడ్జెట్ పెంచేసిన చైనా… యుద్ధం సిద్దంకావాలని పిలుపు
China Defense Budget Increased: పొరుగు దేశం చైనా రోజు రోజుకు కొరకరాని కొయ్యగా మారుతున్నది. రక్షణ రంగానికి సంబంధించి బడ్జెట్‌ను భారీగా పెంచింది. తాజా సమాచారం ప్రకారం చైనా బడ్జెట్‌ను 7.2 శాతం మేర పెంచినట్లు స్పష్టం చేసింది. గతేడాది 7.1 శాతం పెంచగా, ఈ ఏడాది 7.2 శాతం పెంచినట్లు తెలియజేసింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ 225 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రక్షణ బడ్జెట్‌ను పెంచినట్లు తెలియజేసింది. 2025లోగా తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు చైనా ఎత్తులు వేస్తున్నది.
ఇందులో భాగంగానే తైవాన్ చుట్టుప్రక్కల సముద్రంలో ఇప్పటికే చైనా యుద్ధనౌకలు లంగరు వేసి ఉన్నాయి. తైవాన్ గగనతలంపై చైనా యుద్ద విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తైవాన్‌తో పాటు భారత్‌తోనూ చైనాకు శతృత్వం ఉన్నది. లఢఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుదీర్ఘమైన బోర్డర్ ఉన్నది. గతంలో గల్వాన్ లోనూ, తవాంగ్‌లోనూ రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. గల్వాన్ లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 28 మంది సైనికులు మరణించగా, చైనాకు చెందిన వందల మంది సైనికులు మరణించారు. అప్పటి నుండి చైనా తమ సైన్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏడాదికేడాది రక్షణ బడ్జెట్‌ను పెంచుతూ వస్తున్నది.