Viral Video: ప్రస్తుతం కాలంలో చిన్న పిల్లలను (Kids) తక్కువ అంచనా వేయలేం. చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. చిన్న వయస్సులోనే ఎంతో నాలెడ్జ్ (Knowledge) సంపాదించుకుంటున్నారు. అదీ ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.
Viral Video: ప్రస్తుతం కాలంలో చిన్న పిల్లలను (Kids) తక్కువ అంచనా వేయలేం. చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. చిన్న వయస్సులోనే ఎంతో నాలెడ్జ్ (Knowledge) సంపాదించుకుంటున్నారు. అదీ ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తల్లిదండ్రులకే కొత్త కొత్త విషయాలను వివరిస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న పిల్లలు సోషల్ మీడియాలో (Social media) తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తున్న వీడియోలు వైరలవుతుంటాయి. పిల్లల ట్యాలెంట్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల ఇద్దరు చిన్నారులు ఓ పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నేపాల్‌లో ఇటీవల ఓ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్లిలో ఓ అబ్బాయి, అమ్మాయి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. నేపాలీ సాంగ్ పంచే బాజాకు చిన్నారులు డ్యాన్స్ ఇరగదీశారు. అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఎబౌట్ నేపాల్ (everythingaboutnepal) అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
ఇక నెటిజన్లు వీడియోలో చిన్నారుల డ్యాన్స్ చూసి ఫుల్ ఖషీ అవుతున్నారు. వారి ట్యాలెంట్‌ను ప్రశంసిస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు కోట్లాది మంది ఆ వీడియోను చూడగా.. లక్షా ముప్పై వేల మంది లైక్ చేశారు. అంతకముందు కూడా చిన్నారులకు సంబంధించిన వీడియోలు ఎన్నో నెట్టింట్లో వైరలయ్యాయి. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.