పెద్దవారి అండ లేకుండా ఒకటి రెండు రోజులు జీవించాలంటేనే చాలా కష్టం. జనసంచారం ఉన్న ప్రాంతంలో ఎలాగైనా సర్వైవ్ కావొచ్చు. కానీ, కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో చిక్కుకొని జీవించాలంటే అత్యంత దుర్లభం.
Survive Joy of the Nation: పెద్దవారి అండ లేకుండా ఒకటి రెండు రోజులు జీవించాలంటేనే చాలా కష్టం. జనసంచారం ఉన్న ప్రాంతంలో ఎలాగైనా సర్వైవ్ కావొచ్చు. కానీ, కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో చిక్కుకొని జీవించాలంటే అత్యంత దుర్లభం. ఈనెల 1వ తేదీన ఓ చిన్న విమానంలో అమెజాన్ ప్రావిన్స్‌లోని అరరాక్వారా నుంచి శానోస్ డెల్ గువియారేకు ఏడుగురు సభ్యులు బయలుదేరారు. ఇందులో రనోక్ మకుటయ్ తో పాటు ఆమె నలుగురు పిల్లలు, పైలట్, మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారు. అయితే, అమెజాన్ అడవిలోకి ప్రవేశించిన తరువాత విమానంలోని ఇంజిన్ ఫెయిల్ కావడంతో కూలిపోయింది.
విమాన ప్రమాదంలో పైలట్, రనొక్ మకుటయ్, మరో వ్యక్తి మరణించారు. అయితే, 11 నెలలు, 9 ఏళ్లు, నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలు బయటపడ్డారు. నెలల పసిబిడ్డను తీసుకొని 17 రోజులపాటు అడవిలో తిరుగుతూ ఆకులు అలములు తింటూ కాలం గడిపారు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుంచి ఆ ముగ్గురు చిన్నారులు బయటపడటం విశేషం. విమానం కూలిపోయిన తరువాత సైన్యం ఆపరేషన్ హోప్ పేరుతో సెర్చ్ మొదలుపెట్టింది. భారీ వర్షం కురుస్తున్నా సెర్చింగ్‌ను ఆపలేదు. వారం రోజుల తరువాత వారికి విమానం జాడ కనిపించింది. అంతేకాదు, అక్కడ ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. సైన్యం సెర్చింగ్‌ను మరింత ముమ్మరం చేసింది. ఈనేపథ్యంలో కట్టెలు, ఆకులు కనిపించడంతో పిల్లలు బతికే ఉన్నారని గ్రహించిన సైన్యం మరింత ముమ్మరంగా అడవిని జల్లెడ వేసింది. ఎట్టకేలకు ముగ్గురు చిన్నారులను సైన్యం రక్షించారు. చిన్నారుల సాహసాన్ని కొలంబియా అధ్యక్షుడు జాయ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సంబరాలు చేసుకోవాలని ప్రకటించారు.