Jo Biden: జో బిడెన్ కు స్కిన్ క్యాన్సర్..కణితిని తొలగించిన వైద్యులు
Cancer wound was successfully removed from US President’s chest, fit to run for re-election
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కేన్సర్ బారి నుంచి బయటపడ్డారు. ఛాతీ వద్ద కేన్సర్ సోకడంతో వైద్యులు చికిత్స చేసిన కణజాలాన్ని తొలగించారుజ వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయం వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం బిడెన్ ఆరోగ్యంగా ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు తెలియజేశాయి.
జో బైడెన్ కేన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని, రోజువారీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. జో బైడెన్ కు బేసల్ సెల్ కేన్సర్ సోకిందని, ఈ కేన్సర్ వ్యాప్తి చెందదని అందుకే కేన్సర్ కణాలను తొలగించామని శ్వేతసౌధం డాక్టర్లు వివరించారు. బేసల్ సెల్ కేన్సర్ అంటే చర్మం ఉపరితలంపై ఏర్పడే కేన్సర్ అని వైద్యులు చెప్పారు.
80 ఏళ్ల వయసులోను బో బిడెన్ ఎంతో చురుగ్గా ఉంటున్నారు. విదేశాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఉక్రెయిన్ దేశంలో పర్యటించి అధ్యక్షుడిని కలిశారు. అండగా ఉంటామని మరోసారి అభయం ఇచ్చారు. వివిధ దేశాలు ఆపదలో ఉన్న సమయంలో ఆపన్నహస్తం అందిస్తూ పెద్దన్న పాత్రను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సమాయత్తం అవుతున్నారు.