Online Fraud : AI స్కామ్‌కు బలి.. 18 లక్షలు సమర్పణ!
Online Fraud : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఉంటే, దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయని తేలుతోంది. తాజాగా ఈ AIని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా వృద్ధ దంపతులు కొత్త AI స్కామ్‌కు బలి అయ్యారు. వారికి దాదాపు రూ.18 లక్షల నష్టం వాటిల్లింది. తమ మనవడి లాయర్ అని చెప్పుకునే వ్యక్తి నుంచి తమకు ఫోన్ వచ్చిందని, తమ మనవడు జైల్లో ఉన్నాడని, బెయిల్ కోసం డబ్బులు కావాలని చెప్పారని దంపతులు ఆరోపించారు. ది వాషింగ్టన్ పోస్ట్ వార్తల ప్రకారం, కెనడాకు చెందిన రూత్ కార్డ్, తన మనవడు బ్రాండన్ వాయిస్‌లా మాట్లాడుతున్న వ్యక్తి నుండి తనకు కాల్ వచ్చిందని వెల్లడించాడు.
తన మనవడిగా అభివర్ణిస్తూ, తాను జైలులో ఉన్నానని, తన వద్ద పర్సు లేదు కేవలం సెల్‌ఫోన్ ఉందని, బెయిల్ కోసం డబ్బు అవసరమని చెప్పాడని అన్నారు. రోజువారీ గరిష్ట పరిమితి 3,000 కెనడియన్ డాలర్లు (రూ. 1,81,262) విత్‌డ్రా చేసుకోవడానికి తన బ్యాంకును సంప్రదించాడు. తరువాత, వారు మరింత డబ్బు కోసం మరొక బ్రాంచ్‌కి వెళ్లారు. కానీ ఒక బ్యాంక్ మేనేజర్ మరొక కస్టమర్‌కు ఇలాంటి కాల్ వచ్చినట్లు వారికి తెలియజేసి ఈ వాయిస్ నకిలీదని కనుగొన్నారు. ఫోన్‌లో ఉన్న వ్యక్తి అసలు మనవడు కాకపోవచ్చునని మేనేజర్ సూచించారు. తమ మనవడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి తాతలు నగదును సేకరించి స్కామర్‌లకు బిట్‌కాయిన్ ద్వారా డబ్బు పంపారని వివరించారు.