Rishi sunak: అక్రమంగా వస్తే అక్కడికే పంపుతాం..బ్రిటన్ ప్రధాని రిషిసునాక్
Rishi sunak: బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్నారు. అలవచ్చేవారిపై ఉక్కుపాదం మోపనుంది బ్రిటన్. అక్రమంగా దేశంలోకి వలస వచ్చే వారిపై ఆంక్షలు విధించనున్నారు. పడవల్లో అక్రమంగా దేశంలోకి వచ్చే వాళ్లను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకు రానున్నారు. దేశం నుంచి పంపిస్తే మీరు భవిష్యత్తులో అమెరికా కానీ, ఆస్ట్రేలియాలో కానీ బ్రిటన్‌లో కానీ రీ ఎంట్రీకి అస్సలు వీలుండదని బ్రిటన్ ప్రధాని వివరించారు.
దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురాగా.. అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు యూకే ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. దేశంలోకి అక్రమంగా వలసవచ్చే వారిని తీసుకెళ్లి రువాండా దేశంలో పడేస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు.2020లో 8,500 మంది, 2021లో 28వేల మంది, 2022లో బోట్ల ద్వారా బ్రిటన్‌కు 45వేల మంది వచ్చారని అక్కడి అధికారులు తెలుపుతున్నారు.