Russia: ఉక్రెయిన్పై (Ukraine) యుద్ధం (War) ప్రకటించినప్పటి నుంచి రష్యాపై (Russia) ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో (America) పాటు అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి అమెరికా, రష్యా మధ్య వివాదాలు ముదురుతున్నాయి.
Russia: ఉక్రెయిన్పై (Ukraine) యుద్ధం (War) ప్రకటించినప్పటి నుంచి రష్యాపై (Russia) ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో (America) పాటు అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి అమెరికా, రష్యా మధ్య వివాదాలు ముదురుతున్నాయి. ఈక్రమంలో అమెరికాపై ప్రతిస్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. తమపై ఆంక్షలు విధించినందుకు గానూ అమెరికాకు చెందిన 500 మందిపై ( 500 Americans) ఆంక్షలు విధించింది. వారు రష్యాలో ఆడుగుపెట్టకుండా నిషేధం విధించింది. అందులో అమెరికా మాజీ ప్రధాని బరాక్ ఒబామా (Barack Obama) కూడా ఉన్నారు.
తాజాగా దీనిపై రష్యా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. తమపై అమెరికా ఆంక్షలు విధించినందుకుగానూ ఈ నిర్ణయం తీసున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి 500 మంది వ్యక్తులతో కూడిన జాబితాను రష్యా విడుదల చేసింది. అందులో బరాక్ ఒబామా, టెలివిజన్ స్టార్స్ స్టీఫెన్ కోల్బెర్గ్, జమ్మీ కిమ్మెల్, అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్తో సహా పలువురు ప్రముఖులు, మాజీ రాయబారులు, యూఎస్ చట్టసభ సభ్యులు ఉన్నారు.
అయితే వారిపై నిషేధం విధించడానికి గల కారణాలను మాత్రం రష్యా వెల్లడించలేదు. కేవలం తమపై అమెరికా ఆంక్షలు విధించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు అగ్రరాజ్యం కూడా దీనిపై స్పందించలేదు. మరి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.