Joe Biden: పొరపాట్లు, తడబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). గతంలో బైడెన్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు (Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Joe Biden: పొరపాట్లు, తడబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). గతంలో బైడెన్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు (Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల బైడెన్ వర్షం పడుతుండగా గొడుగును (Umbrella) తెరవడానిక ప్రయత్నించారు. కానీ అది ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో బైడెన్ వర్షంలో తడవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
జీ-7 సమావేశాల (G7 summit) కోసం బైడెన్ శుక్రవారం స్పెషల్ ఫ్లైట్‌లో జపాన్‌లోని మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్‌కు వెళ్లారు అయితే బైడెన్ వెళ్లి సమయానికి అక్కడ వర్షం పడుతోంది. దీంతో చేతిలో గొడుగు పట్టుకొని మెట్లు విమానం మెట్లు దిగుతూ కిందికి వచ్చారు. ఆ సమయంలో గొడుగును తెరవడానిక బైడెన్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ అది తెరుచుకోలేదు. అదే సమయంలో జపాన్ విదేశంగ మంత్రి, అధికారులు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత జపాన్‌కు చెందిన పలువురు అధికారులు తమకు తాము బైడెన్‌కు పరిచయం చేసుకుంటున్నారు. ఆ సమయంలో బైడెన్ వర్షంలో తడుస్తూనే ఉన్నారు.
ఆ సమయంలో జపాన్‌కు చెందిన ఓ అధికారి బైడెన్‌కు గొడుగు పట్టారు. ఆ తర్వాత మరోసారి బైడెన్ గొడుగు ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. ఈసారి తెరుచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక గతంలో కూడా ఒకసారి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు అర్థం లేకుండా సమాధానం చెప్పి వార్తల్లో నిలిచారు.
It took Biden almost a minute to figure out how to open his umbrella after landing in Japan in a torrential downpour pic.twitter.com/n1s2KJH9pZ
— RNC Research (@RNCResearch) May 18, 2023