భారత్ వ్యాప్తంగా 500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అన్ని రంగాల్లో తొలగింపులు ఉంటాయని పేర్కొంది. వచ్చే నెలలో తొలగింపులు ప్రారంభమవుతాయని అమెజాన్ వెల్లడించింది.
Amazon: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దిగ్గజ కంపెనీలు దివాళా తీస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఇళ్లబాట పడుతున్నారు. ఇప్పటికే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta), ట్విట్టర్ (Twitter), గూగుల్ (Google) వంటి టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. అటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) కూడా ఇప్పటికే రెండుసార్లు లేఆఫ్స్ ప్రకటించింది. మొదటి రౌండ్లో జనవరిలో 18 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. రెండో రౌండ్లో 9 వేల మందికి ఉద్వాసన పలికింది. ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ (layoffs) ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది అమెజాన్.
భారత్ వ్యాప్తంగా 500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అన్ని రంగాల్లో తొలగింపులు ఉంటాయని పేర్కొంది. వచ్చే నెలలో తొలగింపులు ప్రారంభమవుతాయని అమెజాన్ వెల్లడించింది. ముఖ్యంగా వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్మెంట్ చెందిన ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కంపెనీపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్‌కు సంబంధించి మెయిల్ పంపించినట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయారు.
ఇక గత ఆరు నెలల్లో లక్షల మంది ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పెడ్డారు. ఉన్న ఉద్యోగం పోయి.. కొత్త ఉద్యోగం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి పరిస్థితి కూడా అలానే ఉంది. అక్కడ కూడా వేలాది మంది భారతీయులు ఉద్యోగం కోల్పోయారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త ఉద్యోగం దొరక్క.. వీసా గడువు ముగుస్తుండడంతో తిప్పలు పడుతున్నారు. కొంతమంది తిరిగి భారత్‌కు వచ్చేశారు.