చిన్నపిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తినకుండా అయినా ఉంటారు కానీ.. బొమ్మలతో ఆడుకోకుండా మాత్రం ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు.
USA: చిన్నపిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తినకుండా అయినా ఉంటారు కానీ.. బొమ్మలతో ఆడుకోకుండా మాత్రం ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. ఇలానే ఓ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు తనకెంతో ఇష్టమయిన బొమ్మను ఎయిర్‌పోర్టులో (Airport) మర్చిపోయింది. దానిని చిన్నారికి తిరిగి ఇచ్చేందుకు ఓ పైలట్ (Pilot) వేల కిలోమీటర్లు ప్రయాణించారు. దేశాలు దాటుకుంటూ వెళ్లి చిన్నారికి బొమ్మను అందించారు. ఈ ఘటన అమెరికాలో (America) జరిగింది.
టెక్సాస్‌లో (Texas) రూడీ డొమింగుజ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. అతడిక వాలెంటీనా అనే తొమ్మిదేళ్ల కూతురు ఉంది. కొద్దిరోజుల క్రితం తన కూతురును తీసుకొని రూడీ ఇండోనేషియా టూర్‌కు (Indonesia Trip) వెళ్లాడు. అప్పుడు వాలెంటీనా తనకెంతో ఇష్టమైన బొమ్మను కూడా వెంట తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రయాణంలో బొమ్మను ఎక్కడో మర్చిపోమయింది. ట్రిప్ ముగించుకొని ఇంటికొచ్చాక బొమ్మ కనపించలేదు. దీంతో చిన్నారి దిగులు చెందింది. తల్లిదండ్రులు బ్యాగులతో పాటు ఇళ్లంతా వెతికారు. ఎక్కడా కూడా బొమ్మ కనిపించలేదు.
తల్లిదండ్రులు కొత్త బొమ్మ కొనిస్తామని చెప్పినా వాలెంటీని అదే బొమ్మ కావాతని మారం చేసింది. రోజులు గడుస్తున్నా చిన్నారి ఆ బొమ్మను మర్చిపోలేకపోయింది. చిన్నారి బాధను చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. చివరి సారిగా టోక్యో ఎయిర్‌పోర్టులో బొమ్మను చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు రూడీ బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆబొమ్మ పోగొట్టుకున్నందుకు మా కూతురు ఎంతో బాధపడుతోంది అని రాసుకొచ్చారు.
అయితే ఆ పోస్టు చూసిన ఓ పైలట్ బొమ్మను కనిపెట్టాడు. ఆ బొమ్మను తిరిగి అందించేందుకు టర్కీ నుంచి టెక్సాస్‌కు వెళ్లాడు. మొత్తం 5,880 మైళ్లు ప్రయాణించి చిన్నారికి బొమ్మను అందించి తన ముఖంలో చిరునవ్వును చూశాడు. పోయిందనుకన్న తిరిగి దరకడంతో వాలెంటీనా సంతోషం వ్యక్తం చేసింది.