ఇండోనేషియాలోని(Indonesia) బాలి, లాంబాక్ దీవులకు (Bali and Lombok)ఉత్తరాన సముద్రంలో తెల్లవారుజామున 7.0 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake)సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్(European-Mediterranean) సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
Earthquake : ఇండోనేషియాలోని(Indonesia) బాలి, లాంబాక్ దీవులకు (Bali and Lombok)ఉత్తరాన సముద్రంలో తెల్లవారుజామున 7.0 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake)సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్(European-Mediterranean) సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపంతో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 203 కి.మీ దూరంలో, భూమి ఉపరితలం నుంచి 516 కి.మీ దిగువన చాలా లోతుగా ఉందని EMSC తెలిపింది.
ఇండోనేషియా, యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీలు సునామీ ముప్పు లేదని పేర్కొన్నాయి. భూకంప తీవ్రతను 7.1గా పేర్కొన్నాయి. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ప్రకారం, బాలి, లాంబాక్‌లోని తీర ప్రాంతాలలో తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది.దాని తర్వాత 6.1 మరియు 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. బాలిలోని పర్యాటకులు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు అనుభవించిన తర్వాత వారి గదుల నుంచి బయటకు పరుగులు తీశారు.
“చాలా మంది పర్యాటకులు తమ గదులను విడిచిపెట్టారు కానీ హోటల్ ప్రాంతంలోనే ఉన్నారు” అని ఓ హోటల్ మేనేజర్ చెప్పాడు. భూకంపం అనంతరం వారు తిరిగి వచ్చారని పేర్కొన్నాడు. భవనానికి ఎటువంటి నష్టం జరగలేదని వివరించాడు. భూకంపం వల్ల ఆస్తి నష్టంపై సమాచారం లేదని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ BNPB తెలిపింది. “భూకంపం లోతుగా ఉంది కాబట్టి ఇది విధ్వంసం కాకూడదు” అని BNPB ప్రతినిధి అబ్దుల్ ముహారి అన్నారు.
అయితే ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు వస్తుంటాయి. రెండు వారాల క్రితం కూడా అక్కడ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని టువల్ అనే నగరానికి 142 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. 270 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు, సునామీలు, భూకంపాలు వంటి విపత్తులు తరచూ వస్తుంటాయి.